గండిపేట గేట్లెత్తి.. మూసీలోకి నీరు

గండిపేట గేట్లెత్తి
మూసీలోకి నీరు

నిండుకుండల్లా
జలాశయాలు

హిమాయత్ సాగర్, గండి
పేటకు భారీగా వరద నీరు

అప్రమత్తంగా
ఉండాలని సూచన

రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:

జంట జలాశయాలకు వరద పోటెత్తింది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి కురుస్తున్న వర్షపు నీటి వరద పోటేత్తి జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ లు నిండు కుండల్లా మారాయి. సంబంధిత అధికారులు ప్రమాద హెచ్చరిక ప్రకటించడంతో సిబ్బంది గండిపేట, హిమాయత్ సాగర్, జలశయాల గేట్లను తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గండిపేట 8 గేట్లు 5 ఫీట్ల ఎత్తి దిగువకు 7000 క్యూసెక్కుల నీటిని మూసి లోకి వదిలింది.

అలాగే ఇమేజ్ సాగర్ జలాశయంకు వరద నీరు పోటు ఎత్తడంతో అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది గేట్లు మూడు ఫీట్ల ఎత్తు వరకు ఎత్తిన అధికారులు. రెండు జంట జలాశయాలు వరద నీటితో నిండికుండలా మారడంతో ప్రమాద హెచ్చరికలో భాగంగా దిగువకు నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈనాడు నగరంలోని ప్రజలకు తాగనీతిని అందించేందుకు అవసరమైన గండిపేట ఎమ్మెస్ సాగర్ జంట జలాశయాల మీరు అధికం కావడంతో మూసి పాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా కొన్ని రోజులు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన తాగునీరుకు ఎలాంటి డోకా లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking