ఏసీబీకి చిక్కిన రాధాకృష్ణారెడ్డి

ఏసీబీకి చిక్కిన
రాధాకృష్ణారెడ్డి

ఓ లేఅవుట్ నిర్వాహకుల వద్ద 3.5లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

– డబ్బు, కారు సీజ్ … టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

లంచం డిమాండ్ చేస్తే 1064 కు ఫిర్యాదు చేయండి

– ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్

మేడ్చల్, అక్షిత ప్రతినిధి :

ఓ వెంచర్ నిర్వాహకుల నుండి లంచం తీసుకుంటుండగా ఎల్లంపేట్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ రాధాకృష్ణారెడ్డి ఏసీబీ అదికారులకు చిక్కారు. ఈ సందర్బంగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ లో హెచ్ఎండిఎతో లే అవుట్ చేసుకున్న నిర్వాహకుల వద్దకు వెల్లి మీ లేఅవుట్ గోడ, గేట్ కూడా కూలగొట్టేస్తానని బెదిరించారని చెప్పారు. గోడ, గేట్ కూలగొట్టొద్దంటే తనకు 5 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. లేఅవుట్ నిర్వాహకుల వద్ద వారం రోజుల క్రితం లక్ష రూపాయలు అడ్వాన్స్ గా తీసుకోవడం జరిగిందని తెలిపారు. తరువాత మిగతా 4 లక్షలు కూడా ఇవ్వాలని అడగడంతో లేఅవుట్ నిర్వాహకులు తమను సంప్రదించారని ఎంక్వైరీ చేయడం జరిగిందన్నారు. లేఅవుట్ నిర్వాహకులు 3 లక్షల 50 వేలు ఇస్తాము, మిగతా 50 వేలు తరువాత ఇస్తామని చెప్పడంతో, 3లక్షల 50 వేలు శనివారం ఉదయం కొంపల్లిలోని రాయచందని మాల్ వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ చెప్పారని తెలిపారు. ఏసీబీ అదికారులు పక్కా సమాచారంతో నిఘా వేసి ఉన్నామని రాధాకృష్ణ తన కారులో డబ్బులు పెట్టించుకున్నాడని చెప్పారు. రాధాకృష్ణరెడ్డి ఎడమ చేతి తో డబ్బులు ఉన్న బ్యాగ్ ను తాకి కారులోని ముందల పెట్టుకున్నాడని, మా టెస్టులో కూడా పాజిటివ్ గా వచ్చిందన్నారు. డబ్బులు తీసుకునేందుకు వాడిన కారును కూడా సీజ్ చేసి రాధాకృష్ణరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇతని ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎల్లంపేట్ నుండి మొదటి ఫిర్యాదు వచ్చిందన్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేరని, మున్సిపల్ కమిషనర్ రావాలని సీనియర్ ఆఫీసర్లకు కబురు పెట్టామన్నారు. ఏ అదికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే 1064 ట్రోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాధుపై చర్యలు తప్పక తీసుకోవడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking