అక్రిడేషన్ల రెన్యువల్ అంటే వర్కింగ్ జర్నలిస్టులను అవమానించడమే

అక్రిడేషన్ల రెన్యువల్ అంటే వర్కింగ్ జర్నలిస్టులను అవమానించడమే

మధ్యతరహా,చిన్న పత్రికలు, ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఆదుకొని ప్రభుత్వాలు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పాలడుగుల సురేందర్

వరంగల్, అక్షిత బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇతర సౌకర్యాలు ఏవి ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పాలడుగుల సురేందర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టుగా ఉన్నవారికి అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పత్రికళకు న్యాయంగా ఇవ్వవలసిన అర్హత కు తగ్గట్టు ప్రోత్సాహం ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతోందని గత మూడు సంవత్సరాల క్రితం నుంచి జర్నలిస్టులు పత్రికా సంస్థలు యాజమాన్యాలు మధ్యతరహా చిన్న పత్రికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నయని కొత్త అక్రిడేషన్లు లేక పత్రికలలో నడపడం చాలా క్లిష్టమైన సమస్యగా తయారైందని అక్రిడేషన్లు లేకపోవడం వల్ల కొత్తగా చేరిన జర్నలిస్టులు గుర్తింపు లేక ఏ విధమైన ప్రభుత్వ సంక్షేమం అందగా కనీసం ప్రభుత్వ గుర్తింపు లేక గతంలో అక్రిడేషన్లు ఉన్నవారే గత మూడు సంవత్సరాల నుంచి మూడు నెలలు ఆరు నెలలు దాన్ని తొలగించుకుంటూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించడమే కాకుండా పనిచేస్తున్న జర్నలిస్టులను చేయనీయకుండా నివారిస్తుందని ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులు ఎక్కువమంది అక్రిడేషన్ లేక అవస్థలు పడుతున్నారని దీనిని ప్రభుత్వాలు, మీడియా అకాడమీ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలం నుండి క్రొత్త విధి విధానాలు రూపకల్పన చేశామని త్వరలో వాటిని ఆన్లైన్ ద్వారా నిబంధనల మేరకు దరఖాస్తులు స్వీకరించి కొత్త అక్రిడేషన్లు అందజేస్తామని చెబుతూనే ఇరవై ఒక్క నెలలుగా గతంలో మంజూరీ చేసిన జర్నలిస్టులను మళ్లీమళ్లీ రెన్యువల్ చేయడం వల్ల కొత్తగా చేరిన వారు అవకాశం దక్కక తీవ్ర ఆందోళన గురవుతున్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకొని జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీలను నియమించి కొత్తగా వస్తున్న వారికి వెంటనే అక్రిడేషన్లు అందజేసి వర్కింగ్ జర్నలిస్టుగా ఎవరున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు. వారి సామర్థ్యం ఏంటి అలాగే ఒక నిర్దిష్ట పద్ధతి ద్వారా పెద్ద మధ్యతరహా చిన్న పత్రికలకు వెంటనే అక్రిడేషన్లు అందించి మిగతా సంక్షేమం అభివృద్ధి దిశగా జర్నలిస్టులను ప్రోత్సహించాలని లేనట్లయితే సమాజాన్ని తట్టి లేపే నాలుగవ స్తంభం నైతిక ధైర్యం కోల్పోతుందని ఇది ప్రజాస్వామ్యానికి సమాజ మేల్కొలుపుకు గొడ్డలి పెట్టు అవుతుందని అన్నారు.

మీడియా అకాడమీ పత్రికలన్నిటికీ పెద్దదిక్కుగా ఉండి సమస్యల పరిష్కారం కోసం మధ్యతరహా చిన్న పత్రికలు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు పత్రిక స్వేచ్ఛ పత్రిక నైతిక విలువలు పెంపొందించుకునేందుకు పెద్దదిక్కుగా ఉండి ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలబడాల్సిన వ్యవస్థ అని అన్నారు.

వెంటనే ప్రభుత్వం ద్వారా చర్చలు జరిపి కొత్త అక్రిడేషన్లు ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించి అందరికీ న్యాయం జరిగేలా పెద్దన్న పాత్ర పోషించాలనీ తద్వారా అధికారంలో ఎవరున్నా మీడియా అకాడమీ స్వతంత్ర వ్యవస్థగా పత్రిక స్వేచ్ఛను సమాజ మార్పును కోరుకునే విధంగా ముందుకు సాగాలని అప్పుడే మీడియా మనగలుగుతుందని లేకపోతే ఎవరు అధికారంలో ఉంటే వారి ఆధిపత్యం చెలాయించుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన మీడియా మనగలగలేదని దీనిని ప్రజా పాలన ప్రభుత్వం, మీడియా అకాడమీ,గుర్తింపు పొందిన మూడు యూనియన్ ల నాయకులు గుర్తుంచుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking