మిత్రుడి మరణం కన్నీటి సముద్రం మనస్సును కదిలించిన ఆర్థిక సహాయం
మరణించిన మిత్రుని కుటుంబానికి చేయూతగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు
సహాయం కేవలం రూపాయలే కాదు హృదయాలనుండి వెలువడిన మమకారం
మిత్ర బంధం మానవ విలువల కాంతిగా నిలిచిన దశదినకర్మ
నాగారం అక్షిత న్యూస్ :- చిన్ననాటి స్నేహం జీవితాంతం నుంచే బంధం అని మరొక్కసారి తోటి స్నేహితులు నిరూపించారు. మండల పరిధిలోని డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన బోలగాని శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మృతి చెందడంతో చిన్ననాటి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు బాల్యం నుండి ఆయనతో మమేకమైన స్నేహితులకు కూడా తీరని లోటుగా మిగిలింది. మృతుని దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా మృతుడు బోలగాని శ్రీనివాస్ చిన్ననాటి స్నేహితులు ఆవేదనతో హాజరై స్నేహితుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కష్టసుఖాల్లో మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థికపరంగా కూడా తోడ్పాటు అందిస్తూ రూ.21,500/-సహాయం మృతుని భార్య పిల్లలకు అందజేశారు. స్నేహితుని ఇంటికి చేరుకొని ఆయన భార్యక పిల్లలను చూసి క్షణం ఆగకపోయి కన్నీటిపర్వంతామయ్యారు. మనం చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్నాం, చదువుకున్నాం, నేడు తోటి స్నేహితుడు లేకుండా ఈ కార్యక్రమంలో నిలబడి ఉండడం భరించలేని బాధగా ఉందని అంటూ మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబానికి తోడుగా ఉండి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా వెనకడుగు వేయవమని హామీ ఇచ్చారు. ఒక మనిషి మరణం తర్వాత కూడా అతని వ్యక్తిత్వం, మంచితనం, స్నేహబంధం ఎలా నిలిచి ఉంటాయో ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది. శ్రీనివాస్ జీవితాంతం అందరితో ఆప్యాయంగా, ప్రేమతో సహాయం చేయాలనే తపనతో గడిపారని, అదే భావనతో ఇప్పుడు మేం ఆయన కుటుంబాన్ని అండగా నిలబెట్టుకోవడం సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈరోజుల్లో స్నేహం కేవలం మాటలకే పరిమితమైపోతుంది, కానీ శ్రీనివాస్ స్నేహితులు చూపిన మానవతా విలువలు మనస్సును కదిలించేలా ఉన్నాయని పలువురు హర్షిస్తున్నారు. ఇలాంటి నిజమైన బంధాలే మానవ సమాజాన్ని నిలబెడతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరణం మనిషిని తీసుకెళ్తుంది కానీ స్నేహం ఎప్పటికీ చావదు అనే జీవన సత్యంగా మార్చిన ఈ స్నేహితులు సమాజానికి ఒక పాఠం నేర్పారు. స్నేహం, మానవత, ఆప్యాయత ఇవి ఎప్పటికీ మానవ జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన దీపాలు. శ్రీనివాస్ లేకపోయినా ఆయన స్నేహబంధం చూపిన మానవతా దీప్తి ఆయన ప్రేరణకు శాశ్వతంగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. మేమంతా సమిష్టిగా మేము కేవలం ఈరోజు కాదు ఈ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని పిల్లల చదువులు ముందుకు సాగేందుకు అవసరమైన సహాయం కూడా అందిస్తామని మా స్నేహితుడు శ్రీనివాస్ ఆత్మకు అదే నిజమైన నివాళి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపేట కాశయ్య, గుండేటి లక్ష్మణ్, దీగోజు సత్యనారాయణ, గైగుల్ల శ్రీనివాస్, సంపేట శ్రీనివాస్, గైగుళ్ల సైదులు, మామిడాల వెంకటేశ్వర్లు, మామిడాల వేణు, భయ్యం లింగయ్య, సూర భద్రయ్య, గైగుళ్ళ వెంకన్న, గైగుళ్ల బొంబాయి వెంకన్న, చిన్న తదితరులు పాల్గొన్నారు.