పోషకాహారంతోనే ఆరోగ్యం..
గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి…
ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభ రాణి
మేడ్చల్,అక్షిత బ్యూరో: దుండిగల్ సెక్టార్ లో గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి,పోషణ మాసంలో భాగంగా దుండిగల్ సెక్టార్ దూలపల్లి అంగన్వాడి ఫస్ట్ సెంటర్లో పోషణ సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ఐసి,డి,ఎస్ సూపర్వైజర్ ప్రాజెక్ట్ శోభారాణి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు తల్లులకు పోషకాహారం విలువలు కలిగిన ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి ప్రతిరోజు భోజనం చిరుధాన్యాలు పాలు గుడ్లు ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి,అన్నారు, అంగన్వాడి సెంటర్ లో గర్భిణీలకు బాలింతలుకు ఒక పూట సంపూర్ణ భోజనం అందజేస్తున్నారు ఏడు మూడు నెలల పిల్లలకు బాల అమృతం తినిపించాలి బాల అమృతం లో పోషిక విలువలను తెలియజేశారు. అన్న ప్రసన్న అక్షర అభ్యాసం కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ మేడ్చల్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ శోభారాణి, హై స్కూల్ టీచర్ అంగన్వాడి టీచర్స్ ఆయాలు పిల్ల తల్లులు గర్భిణీ స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..