తొలిసారి పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి క్రీడలు…

తొలిసారి పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి క్రీడలు…

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు

పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి :
నేటి నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్,కబడ్డీ పోటీలకు పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా నిలవబోతోంది.
స్వతహాగా క్రీడాకారుడు,క్రీడల పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచే పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు మైత్రి మైదానాన్ని సిద్ధం చేశారు.సొంత నిధులతో క్రీడా పోటీలతోపాటు, క్రీడాకారులకు ఉచిత వసతి, భోజనం,ట్రోఫీలు,జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, 60 మంది శిక్షకులు,160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడ సంబరాల్లో పాల్గొనబోతున్నారు.. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా వాలీబాల్,కబడ్డీ అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తమ అదృష్టం
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

పటాన్‌చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో మొట్టమొదటిసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్‌చెరును వేదికగా నిలపడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించిన అనంతరం తమకు ఈ అవకాశం లభించింది. పటాన్‌చెరులో మొట్టమొదటిసారి జరగబోతున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.అతి త్వరలో మహిళల కబడ్డీ జాతీయ పోటీలకు పటాన్‌చెరు వేదికగా నిలవబోతుందని తెలియజేసేందుకు సంతోషకరంగా ఉంది. నియోజకవర్గంలోని ప్రతి క్రీడాకారుడిని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking