బిసి ఉద్యమం ఒక అగ్గి రవ్వ లాంటిది
* సామాజిక ఉద్యమకారుడు లింగయ్య
తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి:
అగ్గి రవ్వంత ఉన్నప్పుడు అది చిన్న దీపమై వెలుగునిస్తుంది. అదే భగవంతుని దగ్గర మంగళ హారతిలో వెలుగై అందరి చేత దండాలు పెట్టించుకుంటుంది అని తిరుమలగిరి మండల కేంద్రంలో పత్రిక విలేకరులతో సామాజిక ఉద్యమకారుడు గాదర బోయిన లింగయ్య ఎం ఎ , టి పి టి అన్నారు.
అదే అగ్గి అవనిపై పడితే ధావనములా వ్యాపించి అడవిని దహించి వేస్తుంది. సమస్తము నాశనం చేస్తుంది. అంతా కాల్చి వేస్తుంది బూడిద చేస్తుంది. బీసీ ఉద్యమం అగ్గి రవ్వలాగా ఊరురా వ్యాపించాలి. ఎవరైతే అడ్డు పడుతున్నారో వారిని దహించి వేయాలి. బిసి ఉద్యమానికి అడ్డుపడే రాజకీయ పార్టీలను ఓటు అనే ఆయుధం ద్వారా కాల్చి బూడిద చేయాలి. అక్టోబర్ 18 తారీకున బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే సంపూర్ణ బందు కు స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలి.ఇది మన ఆత్మ గౌరవ సమస్యగా భావించండి. ఎవరో వచ్చి బందు చేస్తారు. అని అనుకోకుండా మన బీ సీ లము అయినా మనము మనమే ఎక్కడికక్కడ సంపూర్ణంగా పాఠశాలలను, వ్యాపార కార్యక్రమాలన్నింటినీ దుకాణాలను ఆర్టీసీని అన్నిటిని బంద్ చేసి మన మెసేజ్ ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక లాగా ఉండాలి అని అన్నారు.