డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ను ప్రారంభించిన గవర్నర్

డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ను ప్రారంభించిన గవర్నర్

– మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న గూగుల్‌

– ఈ ఒప్పందంతో 50వేల మంది విద్యార్థులకు గుర్తింపు రానుంది

– తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

మేడ్చల్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బుధవారం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మైసమ్మగూడలో గల మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ లో గూగుల్‌ తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ను జ్యోతిప్రజ్వాలన చేసి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు.

గూగుల్ లోగోతో ఉన్న 50వేల బెలూన్లు ఆకాశంలోకి ఎగరేస్తూ ఈ డిజిటల్ భాగస్వామ్యానికి ప్రత్యేక ఆకర్షణతో పాటు మల్లారెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుందన్నారు. దీని ద్వారా 50వేల మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో ‌సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల సర్టిఫికేషన్‌లు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూగుల్ సంస్థ నుండి మిస్టర్ వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ – ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్స్) మిస్టర్ సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ – ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్స్) మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతీ రెడ్డి, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, 50వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking