యాదగిరి క్షేత్రంలో గొంగిడి దంపతుల పూజలు

యాదగిరి క్షేత్రంలో గొంగిడి
     దంపతుల పూజలు

యాదగిరిగుట్ట / అక్షిత న్యూస్:

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, డిసిసిబి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సాంప్రదాయంగా స్వాగతం పలికారు.

అనంతరం గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని, నవంబర్ 7వ తేదీన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి రెండవ కుమార్తె హర్షిత వివాహం నిహాంత్ తో జరగనున్న నేపథ్యంలో శ్రీస్వామి వారి పాదాల వద్ద మొదటి పత్రికను పెట్టి పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న గొంగిడి దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా.. ప్రోటోకాల్ అధికారి రాజన్ బాబు శ్రీ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీద రవీందర్ గౌడ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking