ఇళ్ల ప్రగతి దిశగా
అడుగులు
త్వరగా నిర్మించుకోవాలి
కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :
ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకొని గృహ ప్రవేశం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. శుక్రవారం కోయిలకొండ మండలం అనంతపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో 10 ఇండ్లు మంజూరు అయినట్లు, వాటి నిర్మాణ ప్రగతి గురించి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భీమమ్మతో మాట్లాడారు.ఎన్ని చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు.ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలు తెలుసుకున్నారు
.ఇల్లు కంప్లీట్ అయిన శివరంజని లబ్ధిదారు ఇంటిని పరిశీలించారు. ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రభుత్వ డిజైన్ ప్రకారం మంచిగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలను అందజేసి ఇండ్ల నిర్మాణానికి సహకారాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా బిల్లులను లబ్ధిదారులకు అందిస్తామని ఆమె తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను అవగాహన కల్పించాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం కోయిలకొండ కోటను జిల్లా కలెక్టర్ సందర్శించారు. కోటను పరిశీలించి నిర్మాణం గురించి తెలుసుకున్నారు.కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏంపిడిఓ ధనుంజయ గౌడ్,తదితరులు పాల్గొన్నారు