బీజేపీ పార్టీతోనే బీసీలకు న్యాయం

బీజేపీ పార్టీతోనే బీసీలకు న్యాయం

బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం

బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి జడ సతీష్

వర్ధన్నపేట, అక్షిత ప్రతినిధి :

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు శనివారం 18న తలపెట్టిన బీసీ బంద్ ఫర్ జస్టిస్ ని విజయవంతం చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి జడ సతీష్ పిలుపునిచ్చారు. బీసీ లకు 42 శాతం
రిజర్వేషన్ అమలు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలులో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే ప్రభుత్వానికి సూచించడం జరిగిందని గుర్తు చేశారు. బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోందని, బీసీ రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని,42 శాతం పేరిట కాంగ్రెస్ బీసీ లను ఆశల పల్లకిలో ఊరేగించిందని, ఏమీ కాకముందే కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే జీవో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకే కుట్ర పన్నిందన్నారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ఇతర పార్టీలపై రుద్ది బురదజల్లే ప్రయత్నం చేసి, రాజకీయ పబ్బం గడుపు కుంటుందని రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. రేపటి బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ బంద్ కి విద్యా సంస్థలు, కళాశాలలు, వ్యాపార రంగాలు మరియు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking