నాగరాజును సత్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

నాగరాజును సత్కరించిన
ఎమ్మెల్యే బిఎల్ఆర్

ఇందిరమ్మ ఇల్లు
పేదల ఆత్మగౌరవం

*ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ మండలం గూడూరు చెందిన ఇరుగంటి లింగమ్మ, చిన్నమట్టయ్య దంపతుల కుమారుడు నాగరాజు ఇటీవల జరిగిన గ్రూప్ -2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపీఓ ఉద్యోగాన్ని దక్కించుకున్నందున ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అభినందించారు.ఈ మేరకు ఆయన నాయకులతో కలిసి నాగరాజు ఇంటికి వెళ్లి సన్మానించారు.ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన కోరారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఉద్యోగ బాధ్యతలలో పేదల పక్షాన నిలబడి సేవలందించాలన్నారు.పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో స్థానికులతో కలిసి దీపాలు వెలిగించి ఎమ్మెల్యే బిఎల్ఆర్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే బిఎల్ఆర్ తమ మధ్య దీపావళి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని కోరుకుంటున్నానన్నారు.ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లపై వెలుగులు గెలిచిన సంకేతంగా భావిస్తామని అన్నారు.

అదేవిధంగా గ్రామంలోని నూతనంగా నిర్మాణమై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇంటిని స్థానికులతో కలిసి సందర్శించారు.లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking