నేటి నుంచి మహా అన్న ప్రసాద వితరణ

 

నేటి నుంచి
మహా అన్న ప్రసాద వితరణ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నేటి నుండి మండల కాలం బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నటు పులిమేడు ఆశ్రమ గురుస్వామి, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్వామి అయ్యప్ప ఆలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపటి నుండి మండల కాలం వరకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని అయ్యప్ప శివ ఆంజనేయ భవాని మాత మరియు ఇతర స్వాములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని అదేవిధంగా రేపు చాలా గొప్ప పర్వదినమని స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ నక్షత్రమని అదేవిధంగా మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవిల వివాహ వార్షికోత్సవ రోజు అని అదేవిధంగా కార్తీక మాస ప్రారంభోత్సవం కాబట్టి ఆ ఆదర్శ దంపతుల చేతుల మీదుగా ఈ మండల కాలం మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని మాధవిమాత సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి స్వరూపమని గత కొన్ని సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో ఏ గుడి ప్రారంభోత్సవానికైనా ఏ పుణ్యకార్యాలకైనా వారే అన్న ప్రసాద సమర్పకులుగా ఉండి ప్రతి ఒక్కరికి కడుపునిండా భోజనం దొరికేదాకా లేదనకుండా అందరి కడుపు నింపే మహాతల్లి మాధవి అని ఆమె ధర్మపత్నిగా శాసనసభ్యులు బిఎల్ఆర్ కు దొరకటం వల్లనే ఎన్నో సేవా కార్యక్రమాలను మన బిఎల్ఆర్ నిర్విఘ్నంగా చేయగలుగుతున్నారని అడిగిన వారికి లేదనకుండా వారికి తోచిన సాయాన్ని అందజేస్తున్న ఆ పుణ్య దంపతులు సాక్షాత్తు ఆ శివపార్వతుల అంశగానే మిర్యాలగూడ నియోజకవర్గానికి లభించడం మన అదృష్టమని వారు తెలంగాణలోనే చెప్పుకోదగ్గ విధంగా మిర్యాలగూడ పట్టణంలో మూడు పర్యాయాలు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఆ దంపతులకే దక్కుతుందని అదేవిధంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు కార్యక్రమం ద్వారా ఎన్నో వేల మంది జంటలకు వివాహ కిట్లను ముస్లింలకు షాదీ ముబారక్ కిట్లను కుల మతాలకతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి వివాహ కిట్లను అందజేసిన ఘనత వారిదని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చెప్పడానికి ఒకరోజు సమయం కూడా సరిపోదని విద్యార్థులకు యువతకు క్రీడాకారులకు మహిళలకు నిరుపేదలకు అన్నా అంటే నేనున్నా అంటూ ముందుకు వచ్చే మహోన్నత వ్యక్తి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల అదృష్టమని వారు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడానికి అయ్యప్ప స్వామికి అష్టశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ రేపటి నుండి జరగబోయే మహా అన్నప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్క స్వామి పాల్గొనాలని కోరారు. అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ ముక్కాపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహా అన్న ప్రసాద కార్యక్రమం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఆధ్వర్యంలో బుధవారం నుండి ప్రారంభమవుతుందని శివ ఆంజనేయ అయ్యప్ప ప్రతి ఒక్క స్వామి అన్న ప్రసాద కార్యక్రమంలో క్రమశిక్షణతో పాల్గొనాలని అడగ్గానే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నా శాసనసభ్యులు బిఎల్ఆర్ కు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై రెండు గంటలకు ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్క స్వామి సకాలంలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని స్వాములందరూ సహకరించాలని, అదేవిధంగా గత సంవత్సరం బిఎల్ఆర్ ఆధ్వర్యంలోనే అయ్యప్ప దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందని ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతుందన్నారు. అదేవిధంగా మేము ఎప్పుడు ఏ సహాయము అడిగినా కాదనకుండా వెంటనే చేస్తున్న బిఎల్ఆర్ కి అయ్యప్ప స్వామి దయవల్ల ఎప్పుడూ శుభం జరగాలని కోరుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో రైస్ మిల్లర్ గుడిపాటి నవీన్, 25 వ వార్డు ఇన్చార్జ్ గోదాల జానకిరామ్రెడ్డి, నాయుడు, గురుస్వామి, గురువారెడ్డి గురుస్వామి, బాలునాయక్ గురుస్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking