గుండెపూరి గ్రామం నా గుండెకాయ

*గుండెపూరి… నా గుండెకాయ 

ఎమ్మెల్యే సామెలు*

తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి :

తిరుమలగిరి మండల కేంద్రం గుండెపురి గ్రామంలో ఎన్జి ఆర్ఎస్ పథకం కింద 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన తెలంగాణ ఉద్యమ కారులు అభివృద్ధి ప్రదాత తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతోనే ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గుండెపూరి గ్రామంలో ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం కోసం చేశానని అన్నారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. గుండెపురి గ్రామాన్ని అన్ని విధంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గుండె పూరి గ్రామ ప్రజలు నా గుండెకాయ లాంటి వారు అని అన్నారు. తిరుమలగిరి మాలిపురం చౌరస్తా నుండి వాయ గుండెపురి పస్తాల శాంతినగర్ క్రాస్ రోడ్ వరకు రోడ్డు నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో మొదలవుతుందని అన్నారు. సిద్ధి సముద్రం గ్రామపంచాయతీ నుండి మొండి చింత తండా గ్రామం వరకు, చౌల్ల తండా నుండి వయ రూప్ల తండా బండ రామారo గ్రామం వరకు బిటి రోడ్డు మంజూరు అయినది త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుంది తర్వాత పనులు మొదలయితుందని అన్నారు. గ్రామ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి నేను పరిష్కరిస్తానని , గుండెపురి ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటానని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు , నాయకులు , ప్రతి ఒక్కరూ అందరూ సమిష్టిగా కష్టపడి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరిప్రసాద్, ఎంపీడీవో లాజర్ , సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మిలాల్ నాయక్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు బాలకృష్ణ, మండల యువజన అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ ఇన్చార్జి కందుకూరి లక్ష్మయ్య, గ్రామ నాయకులు కొమ్ము సోమన్న, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, బోండ్ల వంశీ, చింతపల్లి శేఖర్, రాములు, లకావతు సైదా నాయక్, సైదులు, ఆరోగ్య సంబంధిత అధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking