తడిసిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు

తడిసిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు

సన్నధాన్యానికి రూ. 500 మద్దతు ధర

ఆరబెట్టిన ధాన్యానికి ప్రాధాన్యత

ధాన్యం తడవకుండా కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలి

తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్

నాగారం అక్షిత న్యూస్ :-రైతు పంట అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక, రైతు రక్షణ ప్రభుత్వ బాధ్యత అని తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వర్ధమానుకోట, నాగారం, శాంతినగర్ గ్రామాలలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మరియు మండల పరిధిలోని శ్రీనివాస సిద్ధి కాటన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల అకాల వర్షాల ప్రభావంతో పండిన ధాన్యం తడిచిపోయిన సందర్భంగా రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని, తమ కష్టార్జిత పంటకు న్యాయమైన ధరను కచ్చితంగా ప్రభుత్వం అందిస్తుందని, పంట నష్టాన్ని రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే భారం మోస్తదని రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మాత్రమే తేవాలని సూచించారు. ధాన్యంలో తేమ లేకుండా సరిగ్గా ఆరబెట్టి తేవాలని, ధాన్యంలో మట్టి, రాళ్లు, కలవకుండా చూడాలని తెలిపారు.

వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ధాన్యం తడవకుండా రైతులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రకటించిన సన్న రకాల ధాన్యానికి రూ.500/-ప్రత్యేక బోనస్ తప్పకుండా అందుతుందని అన్నారు. రైతులు మధ్యవర్తుల చేతిలో ధాన్యం అమ్మి నష్టపోకూడదని దళారీల అబద్ధపు రేట్లకు లొంగవద్దని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతు శ్రమకు తగిన గౌరవం లభిస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో మండల వ్యాప్తంగా పండిన ధాన్యం భద్రంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల ఆదాయ భద్రత, వ్యవసాయ స్థిరత్వం కోసమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కండె అంజయ్య, జంపాల రవి, మండల ఏపీఎం వెంకన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన వెంకట భిక్షం, యల్మకంటి సోమయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ యాకూబ్ వలి, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, ఇంద్రసేనారెడ్డి, ఆనంతుల వెంకటయ్య, పొదిల లింగయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల సైదులు, మల్లెపాక పరశురాములు, షేక్ జాన్, షేక్ సలీం, చిప్పలపెల్లి సోమయ్య, కన్నెబోయిన లింగమల్లు,బండగొర్ల జనార్దన్, చిప్పలపెల్లి అంజయ్య, షేక్ సైదులు, పాల్వాయి పరుశరాములు, షేక్ అక్బర్, తంగెళ్ళ వెంకన్న, షేక్ సైదులు, గద్దల యాదగిరి, అంజయ్య, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking