ప్రతి పల్లెకు వైద్య సేవలు

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి పల్లెకు వైద్య సేవలు

పస్తాల ప్రజల ఆరోగ్య రక్షణకు ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

పల్లె ప్రజల ఆరోగ్య రక్షణకు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు

గ్రామీణ ఆరోగ్య సేవలకు కొత్త దిశగా పస్తాల ఆరోగ్య కేంద్రం

తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు

నాగారం అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని పస్తాల గ్రామంలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందించడానికి ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలలో పస్తాల గ్రామానికి ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన, ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామ ప్రజలకు శుభసూచకమని తెలిపారు. ప్రతి గ్రామానికి ప్రాథమిక వైద్య సేవలు అందించడం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, అది ప్రతి పల్లె ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రోగ నివారణ, వ్యాధి నిరోధ వాక్సినేషన్, ప్రాథమిక పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమగ్రమంగ అందించబడతాయని అన్నారు. కొత్త కేంద్రం పల్లె ప్రజలకు సౌకర్యాలను అందించడంతో పాటు సమగ్ర ఆరోగ్య సేవలతో ప్రతి కుటుంబానికి నేరుగా ప్రయోజనం కలిగించే విధంగా రూపకల్పన చేయబడుతుందని తెలిపారు. ఆరోగ్యం మాత్రమే మహత్తర సంపద, ప్రతి చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, సమగ్ర వైద్య సేవలు అందించడం ద్వారా పల్లె ప్రజలు సురక్షితం, ఆరోగ్యంవందంగా ఉండగలుగుతారని స్పష్టం చేశారు. ప్రతి మనిషి గమనిస్తే తగ్గ సమస్యను వెంటనే గుర్తించి, సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ కేంద్రం పల్లె ప్రజలకు ఆరోగ్య అవగాహనకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండగొర్ల కుమారస్వామి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి వెంకట్ రెడ్డి, తిరుమలగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండే అంజయ్య, మాజీ ఎంపిటిసి నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్లకొండ వెంకన్న, వడ్లకొండ వేణు, బుక్క శ్రీను, కడారి వీరస్వామి, పోగుల విక్రమ్, కండె విక్రమ్, బొజ్జ వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారి యనగందుల నాగరాజు మరియు సిబ్బంది, ఆరోగ్యశాఖ ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారి కృష్ణ కాంత్, గ్రామపంచాయతీ సభ్యులు బుక్క అంజయ్య మరియు సభ్యులు, మహిళా స్వయం సహాయ సమితి ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking