ఆరిపోయిన బహుజన జాగృతి జ్వాల

బహుజన జాగృతి జ్వాల ఆరిపోయింది

పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన పలు రాజకీయ నాయకులు

ప్రజా ఉద్యమాలకు జీవం పోసిన బుక్కరాజు తిరుపతి

సమానత్వ సమాజ స్థాపనకు పాటల వాగ్గేయకారుడు

బహుజన ఉద్యమానికి ఊపిరి పోసిన తిరుపతన్న

ప్రజా చైతన్యానికి మార్గం చూపిన సాంస్కృతిక యోధుడు

నాగారం, అక్షిత న్యూస్ :- బహుజన ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడు బుక్కరాజు తిరుపతి మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని ఆయా రాజకీయ పార్టీల నాయకులు తెలిపారు. గురువారం అనారోగ్య కారణం చేత మృతి చెందిన బుక్కరాజు తిరుపతి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ విప్లవ గాత్రం, ప్రజాకవి సింహం, బహుజన ఉద్యమ యోధుడు బుక్కరాజు తిరుపతన్న మరణం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా బహుజన ఉద్యమ వర్గాలకు తీరనిలోటని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి విప్లవ రాజకీయాల పట్ల మక్కువ కలిగి, మనగారిన వర్గాల కోసం పోరాడుతూ, కవిత్వం, పాట, వాగేయం ద్వారా సామాజిక చైతన్యానికి మార్గదర్శకుడైన ఆయన జీవితం ఒక విప్లవ గాథగా నిలిచిందని తెలిపారు. తిరుమలగిరి, తుంగతుర్తి ప్రాంతంలో పీడిత ప్రజల సమస్యలపై తన గొంతు వినిపిస్తూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో సభ్యుడుగా ఆట, పాట, నాటక రూపంలో ప్రజలను చైతన్యపరిచాడని అన్నారు.

ప్రజా సాంస్కృతిక బృందాలను సమీకరించి, బహురూపుల కళామండలి రాష్ట్ర నాయకుడిగా, గ్రామీణ స్థాయిలో బహుజన చైతన్యాన్ని విస్తరింప చేశాడని తెలిపారు. 1996లో తెలంగాణ మహాసభ ఏర్పాటు అయినప్పుడు తిరుపతన్న తెలంగాణ ధూంధాం కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి గళం విప్పిన ప్రజా వాగ్గేయకారుల్లో ముందు వరుసలో నిలిచాడని అన్నారు. ఆయన గొంతు, ఆయన పాటలు, ఆయన ఆలోచనలు తెలంగాణ ఉద్యమానికి దిశ సూపిన చైతన్య శక్తిగా మారాయని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమ రూపకర్త కామ్రేడ్ మారోజు వీరన్న స్థాపించిన ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) లో క్రియాశీలకంగా పనిచేసి, తీర్థ వర్గాల హక్కుల కోసం పోరాడాడని తెలిపారు. అనంతరం పరిస్థితుల దృష్ట్యా బహుజన రాజకీయాల వైపు మలుపు తిరిగి, ప్రజల పక్షాన తన గళాన్ని ఎత్తి పాడాడని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పక్షపాతిగా, ధైర్యవంతుడిగా నిలిచిన తిరుపతన్న జీవితమంతా ఉద్యమమే, సేవే, సమానత్వమే అని ఆయనను స్మరించారు. ఆయన జీవితాన్ని ఒక సమాజ మార్పు కోసం దారిలో నడిచిన సజీవ విప్లవంగా పేర్కొన్నారు. ప్రజా వాగ్గేయకారుడుగా, బహుజన తాత్వికుడుగా, ఉద్యమ యోధుడిగా, తిరుపతన్న కవిత్వం కేవలం సాహిత్యం కాదని, అది అనగారిన ప్రజల వాణి ప్రతిధ్వని అని పల్లె ప్రజల మనస్సు, రైతు కూలీల కష్టం, మట్టి మనుషుల మౌనమని అన్నారు. ఆయన పాటల్లో ఉప్పొంగిన విప్లవ స్వరమే, తెలంగాణ ఆవిర్భావానికి చైతన్యం నింపిందని తెలిపారు. ఆయన కవిత్వం ఒక ఆయుధమైతే, ఆయన ఆలోచన మానవత్వం, ఆయన కలం ప్రజల ధైర్యం అని అన్నారు. తన ప్రతి గీతంలో అనగానిన వర్గాల ఆశయాలను ప్రతిధ్వనింపజేసి, ప్రతి పదములో సమానత్వపు దీపాన్ని వెలిగించాడని అన్నారు. ఆయన పాటలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, రాబోయే తరాల యువతకు చైతన్య దీపాలుగా నిలుస్తాయని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనల జ్వాల ఆయన ఆదర్శం ఎప్పటికీ ఆరిపోదని, పేర్కొన్నారు. బహుజన ఉద్యమంలో తిరుపతన్న పోషించిన పాత్రను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర యాదగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్దన్, కన్నెబోయిన వెంకట బిక్షం, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బొడ్డు శంకర్, కునుకుంట్ల సైదులు, పోలేబోయిన కిరణ్, జాజుల సామేలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నర్సింహారెడ్డి, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ, చెరుకు సుధాకర్, లక్ష్మక్క, కాంగ్రెస్ పార్టీ ఫణిగిరి గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రాంరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు, సిపియుఎస్ఐ నాయకులు దడిద వెంకట్, పత్తెపురం యాదగిరి, గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్, మారోజు వీరన్న అభిమానులు గద్దపాటి సురేందర్, లింగయ్య, పోరెండ్ల సైదులు, వెంకట్ యాదవ్, మందుల కృష్ణ, కరుణాకర్, గంట మల్లయ్య, సిపిఎం నాయకులు బూర్గుల ప్రభాకర్, కడెం లింగయ్య, ఈదురు వీరపాపయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంపాల రవి, నాతి వీరమల్లు, భాను, అవిలయ్య, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాతి వెంకన్న, బిసిపి రాష్ట్ర నాయకులు గాజుల శ్రీను, కళాకారులు కప్పల వసంత, వేముల పుష్ప, గడ్డం ఉదయ్, బండారి నిర్మల, రాజక్క,గాజుల సుకన్య, భాను ప్రకాష్, వెంకట్ రెడ్డి, మందుల వెంకన్న, వెంకటయ్య, శేఖర్ రెడ్డి, మహేష్, ఎర్రబాబు, అంబేద్కర్, సోమయ్య, వెంకటయ్య, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking