భక్తిశ్రద్దలతో ఛట్ పూజ
– శామీర్ పేట్, అత్వెల్లి చెరువుల్లో పూజలు చేసిన ఉత్తర భారతీయులు
– ఛట్ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, అక్షిత ప్రతినిధి :
దీపావళి పండుగ తరువాత 6 రోజుల తరువాత ఎంతో భక్తిశ్రద్దజలతో మర్వాడీలు ఛట్ పూజలు చేసుకున్నారు. శామీర్ పేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి చెరువులో మార్వాడీలు ఛట్ పూజలు చేసుకున్నారు. భక్తిశ్రద్దలతో ఉత్తర భారతీయులు చెరువులలో స్నానాలు చేసి, హారతులు ఇచ్చారు. మంగళవారం శామీర్ పేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి చెరువులో ఉత్తర భారతీయులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ఛట్ పూజల్లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నుండే కాకుండా బీహార్, యూపీ, బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న ఉత్తర భారతీయులు ఛట్ పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీ అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

మానవ జీవనం సాగాలంటే సూర్యశక్తి కావాలని, సూర్య భగవానుడికి పూజ చేసి శక్తి ఇవ్వాలని ఆశీర్వాదం అందించాలని మీరంతా పూజలు చేస్తారన్నారు. హైదరాబాద్ సిటీ పరిసరాల్లో చెరువులన్నీ చచ్చిపోయాయని, వాటన్నిటిని పునర్ జీవనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శామీర్ పేట్ పెద్ద చెరువులో నీరు చాలా మంచిగా ఉన్నాయని, అత్వెల్లిలోని చెరువును కూడా వచ్చే సంవత్సరంలోపు మంచి ఏర్పాట్లు చేసుకుందామన్నారు. హైదరాబాదులో మాత్రమే కాదు దేశమంతా బీహార్, యూపీ, బెంగాల్ వారు విస్తరించి ఉన్నారని, నిర్మాణరంగంలో ఎక్కువమంది బిహారీలే పనిచేస్తున్నారన్నారు. డైరీఫాంలో, కోళ్ళ ఫారం ఫీడ్ ప్లాంట్లలో, కాటన్, మిర్చి గోదాముల్లో, రైస్ మిల్, చర్లపల్లి, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా పరిశ్రమల్లో పని చేసేవారు ఎక్కువ బిహారీలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఉమ్మడి శామీర్ పేట్ మండల మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, బిజెపి నాయకులు నందారెడ్డి, రాజేశ్వర్ గుప్త, మల్లికార్జున్, శ్రీకాంత్ రెడ్డి, జగన్ గౌడ్, బిహారీ సమాజం నుంచి ప్రమోద్ శర్మ, తికధర్ యాదవ్, భావేష్ యాదవ్, నరేంద్ర సింగ్, ముని లాల్ శర్మ, బిపిన్ శర్మ, సురేష్ శర్మ, దీపక్ పాండే, జనసేన సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.