శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముస్తాబ్

శ్రీ గురు నానక్ దేవ్ జీ
మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముస్తాబ్

నవంబర్ 5 వరకు ఉత్సవాలు

సుల్తాన్ బజార్, అక్షిత న్యూస్ :

శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ 565వ జయంతి వేడుకలను గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ, సికింద్రాబాద్, గురు సింగ్ సభ, విశాల్ నగర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 5, 2025 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విశాల్ నగర్ కీర్తన్‌ నవంబర్‌ 1వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమై, విశాల్ నగర్‌లో ముగుస్తుంది.

నవంబర్‌ 3వ తేదీ సోమవారం నాడు గురు సింగ్ సభ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, ఎం.ఎం.టి. మార్కెట్‌, నాంపల్లి రోడ్‌, హైదరాబాద్‌ లో ప్రత్యేక నామవన్‌ దీవాన్‌ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా కీర్తనీ జథా గాయనీ సింగ్ జీ శ్రీనగర్ వాలే, భాయ్ బల్జీత్ సింగ్ జీ యూఎస్ఏ వాలే, భాయ్ హర్జిందర్ సింగ్ జీ శ్రీనగర్ వాలే, భాయ్ మర్కండా వాలే వంటి ప్రసిద్ధ కీర్తనీ జథాలు గురుబాణీ కీర్తన, కథా ద్వారా శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ బోధనలను ప్రతిపాదించనున్నారు.
ఈ పవిత్ర వేడుకలో భక్తులు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి విస్తృతంగా పాల్గొని, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ మహారాజ్‌ ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking