నూతికి డిసిసి
పీఠం దక్కేనా?
కరడు గట్టిన కాంగ్రెస్
నేత నూతి !
భట్టికి నమ్మిన బంటు
కాంగ్రెస్ పటిష్టతకు
ఏళ్ల తరబడి సేవలు
ఖమ్మం/అక్షిత బ్యూరో :
కరడు గట్టిన కాంగ్రెస్ నేతగా నూతి సత్యనారాయణ గౌడ్ పేరొందాడు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ తోనే పేగు బంధం. కాంగ్రెస్ పటిష్టతకు ఏళ్ల తరబడి సేవలందిస్తుండ్రు. సాధారణ కార్యకర్త నుంచి వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక భూమిక పోషిస్తూ పార్టీ పటిష్టతకు విశిష్ట కృషి. కాంగ్రెస్ అగ్రనేతలతో అందరితో కలివిడిగా ఉంటూనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రధాన అనుచరుడిగా చెలామణి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన నూతి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి కరుడు గట్టిన కాంగ్రెస్ వాది.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామం స్థానాల లక్ష్మీపురం కావటం భట్టికి ప్రధాన అనుచరుడు కావడం కాంగ్రెస్ పార్టీలో 1985 నుండి కీలకంగా వివిధ బాధ్యతలలో పనిచేయటంతో ఈసారి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నూతి సత్యనారాయణ గౌడ్ కి అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణుల ఆశాభావం. కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. నూతి సత్యనారాయణ గౌడ్ తల్లి తండ్రులు నూతి అనంతరాములు, అన్నపూర్ణమ్మ, (స్వతంత్ర సమర యోధులు) విధ్యాభ్యాసo 1 నుండి 4వ తరగతి వరకు స్నానాల లక్ష్మీపురం, వైరా మండలం, 5 నుండి 7వ తరగతి వరకు వైరా ప్రభుత్వ పాఠశాల, 8, 9 తరగతులు పూర్తి. అనంతరం హైదరాబాదు, ఇసామియా బజారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి. ప్రభుత్వ జూనియర్ కళాశాల వైరాలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ బికాం వరకు డా. అంబేద్కర్ కాలేజ్, చిక్కడపల్లి హైదరాబాద్. 1984లో పూర్తిచేయడం. కాలేజ్ స్టూడెంట్ లైఫ్ యూత్ కాంగ్రేస్ లీడర్ గా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు.అనంతరం కాంగ్రేస్ పార్టీ రాజకీయాల్లో స్వగ్రామమైన వైరాలో పాల్గొనడం.. అప్పటి సిపియం పార్టీకి వ్యతిరేకంగా సోసైటి ఎన్నికల్లో (1986 సం.లో) నాయకత్వంలో ఇప్పటి జిల్లా కాంగ్రేస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రాసాద్ ని అధ్యక్షునిగా, 13 మంది డైరెక్టర్లతో కాంగ్రేస్ పార్టీ తరపున పోటీకి నిలపడం జరిగింది. ఆ క్రమములో కాంగ్రేస్ పార్టీ గెలుస్తుంది అని భావించిన సిపియం పార్టీవారు భీకరమైనటువంటి దాడి చేయటం దాదాపు 10 మంది తలలు పగలడం, 5 మంది కాళ్లు విరగటం జరిగింది. కేసులు నమోదు అయ్యాయి. 1987 నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా అకౌంటెంట్ గా నియమించబడి తమిళనాడు రాష్ట్రంలోని స్టేట్ ఫార్మ్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చెన్నయ్ లో 3 ఏళ్ల కాలం పనిచేశారు. అనంతరం 1990 లో కేరళలోని అరాళం అనే ప్రాంతానికి బదిలీ పొంది 2 ఏండ్లు పనిచేశారు.రాజీవ్ గాంధి హాత్య అనంతరం దేశంలోని రాజకీయ పరిణామాలకు ప్రభావితుడై 1992లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.తిరిగి వైరా రాజకీయాలల్లో కీలకమైన పాత్ర పోషించడం అప్పటి పిసిసి అధ్యక్షులు అర్మ్స్ టార్చ్ (ఆర్ మల్లు టార్చ్ ఫర్ రూరల్ పూర్) అనే ఎన్జివో సంస్థను ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో స్థాపించి ఖమ్మం జిల్లాకు సెక్రటరీగా పనిచేసి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు బ్లెడ్ డోనేషన్ క్యాంపులు హెల్త్ క్యాంపులు స్వాతంత్ర సమర యోధులకు సన్మానాలు, వృద్ధులు, వృద్దాప్య పెన్షన్లు ప్రభుత్వ పాఠశాలల్లో పలకలు పుస్తకాలు పంపిణి చేశారు. చలికాలంలో పేదలకు
దుప్పట్ల పంపణి, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం గ్రామాల్లో శాంతి యాత్రలు నిర్వహించడం వంటివి చేశారు.1992 లో మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడిగా కాంగ్రేస్ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు.1995 లో వైరా మేజర్ గ్రామ పంచాయితి వార్డు సభ్యులుగా గెలుపొందారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.