అలక్ష్యం వహిస్తే…ఉపేక్షించం

అలక్ష్యం వహిస్తే…ఉపేక్షించం

వసతిగృహం ఆకస్మిక తనిఖీ
ఇంచార్జ్ పై ఆగ్రహం

* కస్తూరిబా, ఆదర్శ పాఠశాలను అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

* రికార్డులను పరిశీలించిన
* అదనపు కలెక్టర్

* నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పొద్దంటూ ఎస్ఓపై ఆగ్రహం

వలిగొండ/అక్షిత న్యూస్ :

విద్యార్థుల వసతి గృహం నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని యాదాద్రి జిల్లా (పంచాయతీరాజ్) అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు.మండలంలోని లోతుకుంటలోని కస్తూరిబా బాలికల పాఠశాల, మోడల్ స్కూల్ వసతి గృహం, మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను మంగళవారం జిల్లా అధనపు కలెక్టర్ ( పంచాయతీ రాజ్ ) భాస్కర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భముగా వసతి గృహంలో విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కోతుల బెడద ఎక్కువగా ఉన్నదని మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని మూత్రశాల కు తలుపులు సరిగా లేవని, మూడు రోజుల నుంచి స్నాక్స్ అందడం లేదని విద్యార్థులు కలెక్టర్కు వివరించారు. దీనిపై వెంటనే ఇంచార్జ్ వార్డెన్ దుర్గాను వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాధికారికి ఫోన్ చేసి మాట్లాడి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని వారికి ఆదేశించారు. అనంతరం వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సగం సందర్శించారు. మందులు సక్రమంగా సరఫరా అవుతున్నాయా లేదా రోగులకి సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అంగన్వాడిని కూడా సందర్శించి వాటిపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కృతిక, స్థానిక ఎంపిడిఓ జలంధర్ రెడ్డి, మోడల్ స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపల్ శేఖర్, కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ దుర్గ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking