గ్రామీణాభివృద్ధిలో
మీ పాత్ర కీలకం
కలెక్టర్‌ను కలిసిన
నూతన ఎంపీడీవోలు
నిర్మల్, అక్షిత ప్రతినిధి :
గ్రామీణాభివృద్ధిలో ఎంపిడిఓల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గ్రూప్-I పరీక్షలో ప్రతిభ కనబరచి ఎంపీడీవో హోదా పొందిన నలుగురు అధికారులు, తాజాగా జిల్లాలోని నాలుగు మండలాలకునియమితులయ్యారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులైన పేదల వరకు చేరేలా చూడాలన్నారు.
అలాగే, ప్రజలతో మమేకమై పని చేయాలని, పథకాల అమలులో పారదర్శకత పాటించాలన్నారు. సేవా భావం, నిజాయితీతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని
ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.