భరోసా కల్పించడానికే ఓపెన్ హౌస్

భరోసా కల్పించడానికే
ఓపెన్ హౌస్

డీఎస్పీ వెంకటేశ్వర్ రావు

వనపర్తి, అక్షిత ప్రతినిధి :

పోలీస్ శాఖపై భరోసా కల్పించేందుకే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 21 నుండి వ 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రావు ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులకు పోలీసు వ్యవస్థ ద్వారా బాలికలు, మహిళలు రక్షణకై పోక్సో చట్టం, భరోసా కేంద్రం పనితీరు, షీ టీం లు అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. పోలీసు వ్యవస్థ భయాన్ని పొగొట్టి తమ రక్షణకే అనే నమ్మకాన్ని ప్రజలకు నమ్మకం కల్పించడంమే ముఖ్యఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణయ్య, టౌన్ ఎస్సై హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking