ర్యాగింగ్ కి పాల్పడితే
కఠిన చర్యలు
షి టీమ్ పోలీసులు
నారాయణపేట, అక్షిత ప్రతినిధి:
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం బూనీడు ప్రభుత్య జూనియర్ కళాశాలలో షీ టీమ్ పోలీసులు విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మహిళా భద్రత, బాలికల విద్య, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, డ్రగ్స్ వ్యసనం నివారణ,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం,సమాజంలో యువత పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా షీ టీమ్ పోలీసులు బాలరాజు,జ్యోతి లు మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి బాధ్యతాయుత పౌరుడిగా ఎదిగి సమాజానికి మంచి మార్పు తీసుకురావాలని, చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పెద్దలకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అలాగే మహిళా భద్రత కోసం ఎవరైనా వేధింపులకు గురి చేసిన, ర్యాగింగ్ చేసిన వెంటనే షి టీమ్ నంబర్ 8712670398 కి సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 100 / 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో లెక్చరర్స్, విద్యార్థులు,షి టీమ్ పోలీసులు పాల్గొన్నారు.