దామరగిద్ద బ్యాంకు మేనేజర్ నోవా పైన చర్యలు తీసుకోవాలి
ఖాతాదారుల చనిపోయి సంవత్సరాలు గడుస్తున్న నామినిలకు ఖాతాలోకి డబ్బులు జామచేయని మేనేజర్
చెప్పులు అరిగేలా బాధితులు బ్యాంకుకు వెళ్లిన కనికరించని బ్యాంకు మేనేజర్,సిబ్బంది
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన ఎర్రముల్ల నరసప్ప తండ్రి తమ్మప్ప అకౌంట్ నెంబర్ – 32480034477 చనిపోయి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది.గత సంవత్సరం బుడ్డ బాలప్ప తండ్రి తమ్మప్ప అకౌంట్ నంబర్ – 32481211507 చనిపోయిండు. బోడి తిప్పమ్మ భర్త భీమ్సప్ప అకౌంట్ నెంబర్ – 40997801699 చనిపోయి ఎనిమిది నెలలు కావస్తుంది. వీరి ముగ్గురి దామరగిద్ద బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్నారు. మరణించిన వారి అకౌంట్ లలో డబ్బులు జమ ఉన్నాయి. ఖాతాదారుల నామిని కుటుంబీకులకు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా గత సంవత్సరాల నుండి బ్యాంకుకు తిరుగుతున్నా చెప్పులు అరిగిపోతున్నాయి కానీ బ్యాంకు మేనేజర్ అధికారులకు కొంచమైనా మానవత్వం లేదని ఖాతాదారుల నామిని, కుటుంబీకులు వాపోతున్నారు. దామరగిద్ద బ్యాంకు ఖాతాలో ఇవ్వకుండా బ్యాంకు మేనేజర్,సిబ్బంది కాలయాపన చేస్తున్నారని విలేకరులతో తెలిపారు. ప్రేమకు సంబంధించిన డాక్యుమెంట్స్ బ్యాంకు మేనేజర్ కి ఇచ్చిన,కంప్లైంట్ బాక్స్ లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. క్లెయిమ్ కు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని బ్యాంకులో ఇచ్చినా కూడా ఫలితం లేదని బాధితులు తెలిపారు.కంప్లైంట్ బాక్స్ లో గత నెల లాలప్ప వారి తండ్రి క్లెయిమ్ గురించి కంప్లైంట్స్ చేస్తే, ఎందుకు కంప్లైంట్ బాక్స్ లో పిర్యాదు చేస్తున్నావు బెదిరించాడు అని బాధితుడు ఎర్రమోళ్ల లాలప్ప తెలిపాడు.డెత్ క్లయీమ్ కు సంబంధించి రిజిస్టర్ ఆఫీసులో ఒకసారి కాకుండా రెండుసార్లు స్టాంపులు ఏసుకొచ్చి ఇచ్చిన కాగితాలను పడేసి బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇద్దరు సురిటిల ఆధార్ కార్డులు ఇస్తే వారిని రమ్మని పిలిచి మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఏం అవసరం మీరు ఆధార్ కార్డులు ఎందుకు ఇచ్చారు అని వారిని బెదిరించి మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని బాధితుల పక్షాన వచ్చిన వారిని మేనేజర్ నోవా బెదిరుస్తున్నాడని బాధితులు తెలిపారు. దామరగిద్ద క్లస్టర్ కు సంబంధించిన గ్రామాలలో చాలా మంది క్లయిమ్ డబ్బులు రాక నామినిలు, కుటుంబీకులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పలువూరు తెలిపారు.