ఏజెన్సీ పేరుతో గీత వృత్తిని దెబ్బతీయడం సమంజసం కాదు

ఏజెన్సీ పేరుతో గీత వృత్తిని దెబ్బతీయడం సమంజసం కాదు

* గీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి

* ఏజెన్సీ కల్లు గీత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి

* కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్

ములుగు, అక్షిత బ్యూరో: ఏజెన్సీ పేరుతో కల్లుగీత వృత్తిని దెబ్బతీయడం సమంజసం కాదని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్, జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు.మంగళవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కల్లుగీత కార్మిక సంఘం కాసగాని స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశానికి గుండెబోయిన రవి గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్ లు ముఖ్య అతిథులు గా హాజరై మాట్లాడుతూ, గత 25 సంవత్సరాల నుండి ఏజెన్సీలో వృత్తి చేస్తున్న కల్లుగీత కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి గీత సొసైటీలను పునరుద్దరణ చేయాలని, సంక్షేమ పథకాలు అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏజెన్సీలో రద్దు చేయబడిన సొసైటీలను పునరుద్దరణ చేయాలని వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆరోజు అసెంబ్లీ లో మాట్లాడడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గీత కార్మిక సమస్యల పైన స్పందించకపోవడం బాధాకరమన్నారు. 25 సంవత్సరాలుగా ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోకుండా గీత కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏజెన్సీ సమస్యపై ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు వృత్తి పింఛను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాటాల కు సిద్ధం కావాలని గీత కార్మికుల కు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కొరకు నవంబర్ 8న ములుగు జిల్లా కేంద్రంలో జరుగు జిల్లా సదస్సుకు గోవిందరావుపేట మండలం నుండి అధిక సంఖ్యలో గీత కార్మికులు హాజరై జయప్రదం చేయాలన్నారు.సమావేశం అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గోవిందరావుపేట కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులుగా రుద్రబోయిన మల్లేష్ గౌడ్ కార్యదర్శిగా వత్సవాయి సారయ్య గౌడ్ మండల గౌరవ అధ్యక్షులు గా ధోనికేల రాఘవులు గౌడ్ ప్రధాన కార్యదర్శి గా బండపల్లి సాంబయ్య గౌడ్ సహాయ కార్యదర్శి గా చౌగాని ఆంజనేయులు గౌడ్ ఉపాధ్యక్షులు గా మెరుగు సుధాకర్ గౌడ్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జక్కు వేణుగోపాల్ గౌడ్, జక్కురాజు గౌడ్, కాసగాని బిక్షం గౌడ్, మద్దెల ఐలుమల్లు గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, జక్కు రాజ మొగిలి గౌడ్, పెరుమాండ్ల మొగిలి గౌడ్, అన్నపురం సదయ్య, మాచర్ల రమేష్ గౌడ్, బోడిగే రంజిత్ గౌడ్ తో పాటు 35 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking