కబ్జా చెర నుంచి  హైడ్రాతో రక్షణ

కబ్జా చెర నుంచి
హైడ్రాతో రక్షణ

రూ.39 కోట్ల విలువైన
రెండు పార్క్ లకు విముక్తి

2600 గజాల
స్థలం స్వాధీనం

ప్రజావాణి ఫిర్యాదులతో

  రంగంలోకి దిగిన అధికారులు

ఆక్రమణలు తొలగించి
పార్కుల చుట్టూ ఫెన్సింగ్

ఆకుల సతీష్ ఫిర్యాదుతో
పార్క్ లకు విముక్తి

మేడ్చల్, అక్షిత బ్యూరో :

నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో కబ్జాకు గురైన రెండు ప్రభుత్వ పార్కులను హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం చర్యలు చేపట్టి, సుమారు రూ.39 కోట్ల విలువైన 2,600 గజాల స్థలాన్ని కాపాడారు. వివరాల్లోకి వెళితే, నిజాంపేటలోని బృందావన్ కాలనీలో 2,300 గజాల పార్కు, కౌశల్యా కాలనీలోని 300 గజాల ‘బనియన్ ట్రీ పార్కు’ కొంతకాలంగా ఆక్రమణలో ఉన్నాయి.

కబ్జాదారులు పార్కు ప్రహరీని కూల్చివేసి, పిల్లల ఆటవస్తువులను ధ్వంసం చేసి, పార్కు బోర్డులను తొలగించారు. సర్వే నంబర్ 93లోని ఈ పార్కు స్థలాన్ని, సర్వే నంబర్ 94కు చెందినదిగా తప్పుగా చూపిస్తూ కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై బృందావన్ కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ భూములు పార్కులకే చెందినవని నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణలను తొలగించి, స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

పార్కులను కాపాడినట్లు సూచిస్తూ అధికారిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. తమ పార్కు స్థలాలు తిరిగి దక్కడంతో బృందావన్ కాలనీ వాసులు, చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ హైడ్రా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు అనుకూలంగా నినాదాలు చేశారు. తమ ఫిర్యాదుపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. నగరంలో చెరువులు, పార్కులు, ఇతర ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా 2024 నుంచి ఆక్రమణల తొలగింపు చర్యలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. కాగా, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో సర్వేనెంబర్ 93, నిజాంపేట్, బృందావన్ కాలనీ నందు 20 గుంటల స్థలం పార్కుగా పేర్కొంటూ 2020లో కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు అభివృద్ధి చేయకపోవడం వల్ల కబ్జాదారులు రెండు నెలల కిందట ఆక్రమించుకోవడానికి ప్రయత్నoపై కాలనీవాసులు, ఆకుల సతీష్ టీం అడ్డుకోవడం, హైడ్రాధికారుల ఒత్తిడి మేరకు ఫిర్యాదు ప్రకారం బాచుపల్లి పోలీస్ లు కేసు నమోదు చేయడమే కాకుండా, రెండు నెలల్లోనే పార్కు సంబంధించిన ఆర్డీవో, కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు మేరకు డిఐ సర్వే పూర్తి చేసి పార్కు ప్రభుత్వ స్థలంగా గుర్తించి స్కెచ్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. దాని సంబంధించిన అన్ని పత్రాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. దీంతో హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చిన విధంగా హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఉత్తర్వుల మేరకు సీఐ నరేష్ ఆధ్వర్యంలో పార్క్ స్థలానికి ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేయడం కాకుండా, హైడ్రా అధికారులకు అనుకూలంగా ధన్యవాదాలు తెలుపుతూ స్లొగన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ ఇప్పటికైనా పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మున్సిపల్ కమీషనర్ నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేసి ప్రజా వినియోగంలోకి తేవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్, అరుణ్ రావు, చంద్రశేఖర్, కమేశ్వర్ రావు,మురళీధర్ రావు, సతీష్, శరత్ కుమార్, సుదీంద్ర వేర్ణా, ఎస్‌.కమేశ్వర రావు, శైలజ, కుసుమ, స్వాతి, కృష్ణ కుమార్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking