ఆర్థిక ప్రగతి
అన్నింటికి మూలం
మాదిగల పారిశ్రామిక
ప్రగతికి కృషి
వ్యాపార వేత్తలుగా ఎదగాలి
మాదిగల పరిశ్రమలకు
అండగా మిక్కి
ప్రొఫెసర్ ఖాసీం
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
ఆర్థిక ప్రగతి అన్నింటికి మూలమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. గురువారం ప్రగతినగర్ లో జరిగిన మిక్కీ ఇంటిగ్రేటెడ్ పారిశ్రామిక అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మాదిగల పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని, వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. మాదిగలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మిక్కి పురుడు పోసుకోవడం శుభ పరిణామమన్నారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలను స్థాపించి అభివృద్ధి బాటలో కొనసాగాలన్నారు. ఏ వ్యాపారాన్ని ఎంచుకున్న మార్కెట్ పరిస్థితులను ఎప్పటి కప్పుడు గమనించాలన్నారు. ఏ రంగం లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయో ? గమనిస్తూ ఆ రంగాన్నే ఎంచుకోవాలన్నారు.

ఇప్పటివరకు పరిశ్రమలు స్థాపించే దిశగా మాదిగలు ఎదగలేదని, ఇప్పుడు ఆ దిశగా ఎదగాలన్నారు. మిక్కి సంస్థ సహాయ సహకారాలు తీసుకొని విరివిగా వ్యాపారాలు స్థాపించాలన్నారు.ఇతర సామాజిక వర్గాలు వ్యాపారాల్లో అగ్రభాగాన నిలిచారన్నారు. మాదిగలకు ఆత్మ గౌరవం ఎక్కువ వ్యాపారాలు చేయడానికి అది కొంత అవరోధంగా మారుతుందన్నారు. కానీ ప్రతిదీ వ్యాపార దృక్పథంతో చూడాలన్నారు.

మిక్కి బృందాన్ని అభినందించారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ సెంటర్ ఫ్యాకల్టీ మెంబెర్స్ శ్రీలత, అనూషలు వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేకల వెంకటేష్, మిక్కీరాష్ట్ర అధ్యక్షులు సుంచు రాజ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహ, రాష్ట్ర కోశాధికారి వుటుకూరి సత్యేంద్ర కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అవునూరి సుధాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కక్కెరవాడ శ్రీనివాస్, స్థానిక వ్యాపారవేత్త డా ప్రశాంత్, సామాజిక వేత్త మేకల నాగేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జానోళ్ల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి ప్రభుదాస్, ఉపాధ్యక్షులు నాగేష్, జాయింట్ సెక్రెటరీ పీటర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కన్వీనర్ వలిగొండ నర్సింహ, స్థానిక నేతలు సంజీవ్, సంతోష్, మల్లికార్జున, రాష్ట్ర నలుమూలల నుండి ఔత్సాహిక పారిశ్రామిక
వేత్తలు హాజరయ్యారు.