*పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
*జడ్పీఎచ్ ఎస్ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ*
*హాజరు రిజిస్టర్ లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్*
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.గురువారం మద్దూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని,జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్య సిబ్బంది హాజరు స్టాక్ రిజిస్టర్ మందుల స్టాకు తదితర అంశాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఓపి ఎన్ని వస్తున్నాయని అడిగారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించి పరిశుభ్రత పై మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. వైద్యులు వైద్య సిబ్బంది సకాలంలో హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.30 ఏళ్లు పైబడిన వారందరికీ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.ఓపీ రిజిస్టర్ ప్రకారం 95 మంది రోగులకు 75 మందికి మాత్రమే మందులను ఇచ్చారని కలెక్టర్ ప్రశ్నించగా 75 మందికి మాత్రమే మందులు అవసరమని,మిగతా వారు కేవలం వైద్య పరీక్షలు మాత్రమే చేసుకున్నారని ఫార్మాసిస్టు తెలిపారు.అనంతరం కలెక్టర్ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా బోధనా అంశాల గురించి విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
విద్యార్థుల సమ్మెటివ్ అసిస్మెంట్ పరీక్షలను జరగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు అని అడిగారు.విద్యార్థులకు అందించే భోజనం సదుపాయల పై ఆరా తీశారు. విద్యార్థులకు ఫుడ్ సేఫ్టీ ముఖ్యమని విద్యార్థులకు భోజనం అందించక ముందు కమిటీ ద్వారా టేస్ట్ చేయాలన్నారు.మెస్ కమిటీ ఫాం చేశారా? మెస్ కమిటీలో ఎంత మంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారని ప్రతి ఒక్కసారి రిజిస్టరును కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు.ఎల్ ఐ ఎఫ్ (లార్నింగ్ ఇంప్రుమెంట్ ప్రోగ్రాం ) పై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వెనుక బడిన సి డి గ్రూప్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలన్నారు.ఎఫ్ ఆర్ ఎస్ ద్వారా విద్యార్థుల అటెండెన్స్ కు,జనరల్ రిజిస్టర్ కు తేడా ఉండడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఏ జి ఆర్ రిజిస్టర్,అకాడమిక్ గైడ్లైన్స్ రిజిస్టర్ లో విధిగా అన్ని వివరాలు ఉండాలన్నారు.విద్యార్థులు క్రమం తప్పకుండ పాఠశాలకు వచ్చేటట్లు చూడాలన్నారు.800 వందల పైచిలుకు విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. NMMS కు ఎంతమంది సిద్ధం అవుతున్నారనీ,లైబ్రరీ లో ఎన్నిరకాల పుస్తకాలు ఉన్నాయని పార్ట్ 1 బుక్స్ వచ్చాయా ? పార్ట్ 2 బుక్స్ అందాయా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.అలాగే ల్యాబ్ లో పరికరాల పై ఆరా తీశారు.విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు ఎలా బోదిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్పోర్ట్స్ లో ఏయే ఆట వస్తువులు ఉన్నాయని అడగగా వాలి బాల్, ఫుడ్ బాల్ మరియు బ్యాట్,చెస్, ఆటవస్తువులు ఉన్నాయని రోజూ ఆడుతామని కలెక్టర్ కు తెలిపారు.ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు మరుగుదొడ్లు అవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఆమె శాంక్షన్ చేయిస్తా అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఏం గోవిందా రాజు,జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి శ్రీనివాస్,సి ఎం ఓ రాజేందర్ కుమార్,మధ్యాహ్న భోజన పథకం ఇంచార్జ్ యాదయ్య మండల విద్యాశాఖ అధికారి బాల కిష్టప్ప,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సవిత పాల్గొన్నారు.