రోడ్డు విస్తరణకు కూడ రిజర్వేషనా..!
సామాజిక కార్యకర్త వల్లపురెడ్డి శ్రీధర్ రెడ్డి
వనపర్తి, అక్షిత ప్రతినిధి :
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో పెబ్బేరు నుంచి వనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా 40×40=80 ఫీట్లుగా విస్తరణ జరగాల్సి ఉండగా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్, టిపిఓఏఈ ఆర్.బి ఏఈ వారు రోడ్డు విస్తరణ పనులకు ఎస్సి, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 39×39=78 ఫీట్లుగా ఓసిలకు 35×35=70 ఫీట్లుగా రిజర్వేషన్లు కేటాయించడం జరిగినది. పెబ్బేరు మున్సిపాలిటీ అధికారులు వారు వారి ఇష్టానుసారంగా కొలతలు నిర్ణయించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఒకన్యాయం, సామాజిక వర్గానికి మరొక న్యాయం, విద్యార్థి మేధావులారా రాజకీయ నాయకులారా సామాజిక కార్యకర్తలారా ఆలోచించండి, ఇది ఎంతవరకు సమంజసం. ఈ రోడ్డు విస్తరణ పనులపై సంబంధిత పై అధికారులు కళ్ళు మూసుకున్నారా? లేదా కాసులకు అమ్ముడుపోయారా?… మీరే ఆలోచించండి. పెబ్బేరు మరియు వనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి రోడ్డుకు ఇరువైపులా 40×40=80 ఫీట్లుగా ఉండాలి. లేదంటే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుందన్నారు.