విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మోటకొండూరు/అక్షిత న్యూస్:
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మోటకొండూరు మండలంలోని నాంచారిపేటలో జరిగింది. గ్రామస్తులు,పోలీసుల కథనం ప్రకారం వివరాలలోకి వెలితే మోటకొండూర్ మండలంలోని నాంచారిపేట లో మహమ్మద్ కరీం అనే వ్యక్తి తన ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో బాగంగా విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చావుబ్రతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న సందర్బంలో అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి బార్య, పాప,బాబు ఉన్నారని చాలా పేదరికంలో ఉన్న మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు