ఘనంగా ప్రారంభమైన మత్స్యగిరీషుడి బ్రహ్మోత్సవాలు
వలిగొండ/ అక్షిత న్యూస్:
వలిగొండ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 వ తేదీ నుండి 5 నవంబర్ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, భగవదనుజ్ఞ, శ్రీ విష్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఋత్విక్ వరణము, మృత్సంగ్రహణము “అంకురార్పణ” ధ్వజపట అధివాసము నివేదన తీర్ధప్రసాద గోష్టి నిర్వహించడమైనదని ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు.ఇట్టి పూజాకార్యక్రమాలలో దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు ఆలయసిబ్బంది, భక్తులు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు