పౌరుల ఐక్యతకు
రన్ ఫర్ యూనిటీ
కలెక్టర్ సిక్తా పట్నాయక్
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
…జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం,పోలీసు అమరవీరుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్,అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,అదనపు ఎస్పి ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య లు పూలమాల ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు పౌరులు,యువత, విద్యార్థులతో కలిసి ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమాని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐఏఎస్,ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపిఎస్ ల జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నందు దేశ ఐక్యమత్యం, పౌరుల ఐక్యమత్యము,దేశ భద్రత దేశ సమగ్రత,దృఢమైన యువత తెలిపే పాటలు నినాదాలతో కలెక్టర్ ఎస్పీ లతోపాటు యువత 2 కే రన్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐఏఎస్ మాట్లాడుతూ..భారతదేశ ఉక్కుమనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వతంత్ర అనంతరం భారతదేశమంతా ఏకీకృతంగా ఉండాలని దేశంలో ఉన్న సుమారు 560 కి పైగా సంస్థానాలను ఏకీకృతం చేసి భారత దేశ ఐక్యమత్యాన్ని చాటారని అన్నారు.ఈ సందర్భంగా ఈయన జయంతిని జాతీయ ఐక్యమత్య దినోత్సవం గా నిర్వహించుకోవడం జరుగుతుందని దీనిలో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్ అండ్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నందు యువత పాల్గొనడం అభినందనీయమని అన్నారు.

దేశ సమగ్రతను దేశ భద్రతను దేశ ఐక్యమత్యాన్ని చాటడంలో యువత ముందుండాలని చెడు అలవాట్లకు చెడు పనులకు దూరంగా ఉంటూ మహానుభావులకు ఘనమైన నివాళి ఘటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల వారోత్సవాలు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమం ముగింపు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ ఐక్యమత్య దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని పౌరులతో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎస్పీ కార్యాలయం వరకు 2k రన్ నిర్వహించడం జరిగిందన్నారు. స్వతంత్ర అనంతరం భారతదేశంలో విడివిడిగా ఉన్న సుమారు 560 సంస్థానాలను ఏకీకృతం చేసి ఒక దృఢమైన దేశంగా నిర్మించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదని ఆయన సేవలను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం 31 అక్టోబర్ ను జాతీయ సమైక్యత దినోత్సవం గా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆ మహానుభావుడి ఆశయాలను ముందుకు తీసుకెళుతూ యువత పౌరులు సన్మార్గంలో నడవాలని,సత్ప్రవర్తతో ఉండాలని దృఢమైన ఐకమత్యం గల భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అదనపు ఎస్పి ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య,సిఐ శివ శంకర్,ఆర్ ఐ నరసింహ,ఎస్ లు వెంకటేశ్వర్లు,రాముడు,రాజు నరేష్,పోలీసు సిబ్బంది, విద్యార్థులు,యువత తదితరులు పాల్గొన్నారు.