దేశ ఐక్యతకు మార్గదర్శి
సర్దార్ పటేల్
ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్షిత ప్రతినిధి:
జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్, జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పి అశోక్ కుమార్, పోలీస్ అదికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను మరియు భద్రత ను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తున్నానని మరియు నా తోటి ప్రజల్లోకి ఈ సందేశాన్ని పంపియటానికి నా వంతు కృషి చేస్తున్నానని ప్రమాణం చేయటం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాకుండా, భారత సమగ్రతకు పునాదులు వేసిన మహానాయకుడు అని సర్ధార్ వల్లభాయ్ పటేల్, యొక్క దూరదృష్టి మేధాస్తు చర్యల ద్వారా దేశ ఐక్యత సాద్యమైందని ఈ ఐక్యత స్ఫూర్తి తో మన దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడటానికి మన వంతు భాద్యతను నిర్వహించాలని అన్నారు. జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి లు వెంకటరమణ, రఘు చందర్,రాములు, సి.ఐ లు ఎస్.ఐ పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.