చదువుతోనే ఉన్నతి

చదువుతోనే ఉన్నతి

సామర్థ్యానికి
పదును పెట్టుకోవాలి

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, అక్షిత ప్రతినిధి:

విద్యార్థులు తమ సామర్ధ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం ఆమె
నారాయణ పేట జిల్లాలోని ఉట్కూరు మండలం కేంద్రంలోని మండల ప్రాథమిక సిపిఎస్ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వివరాలను హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యం పెంచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

అందులో భాగంగా నాలుగో తరగతి విద్యార్థుల తరగతి గదిలో ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులచే గణితం ప్రశ్నలను బోర్డుపై ప్రశ్నలు వేసి జవాబులను రాబట్టారు. అక్కడ ఉన్న విద్యార్థులు లెక్కలను ఎంతో చాకచక్యంగా చేయడంతో విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. రెండో తరగతి విద్యార్థులకు జాలిఫానిక్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ద్వారా ఆంగ్ల విషయంలో నైపుణ్యాన్ని పరిశీలించారు.విద్యార్థులు సౌండ్ ఆధారంగా ఆంగ్ల పదాలను చదివారు.జిల్లాలో యంగ్ ఓలేటర్ క్లబ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పిక్చర్ రీడింగ్ ద్వారా షోకేస్ నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల అనుపస్థితి పట్ల ఆసనం వ్యక్తం చేస్తూ హాజరు శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని హెచ్ ఎం ను ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని నాణ్యత పాటించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలకు రాని తోటి స్నేహితులను ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్లను కూడా పాఠశాలను తీసుకురావాలని ఆమె సూచించారు. విద్యార్థులు పాఠశాలకు వస్తేనే విద్యార్థుల నైపుణ్యం మెరుగు అవుతుందన్నారు.విద్యార్థులకు యూనిఫార్మ్ వచ్చాయా లేదా ప్రతి విద్యార్ధికి రెండు జతల స్కూల్ యూనిఫామ్ ను ఇవ్వాలన్నారు.తర్వాత పాఠశాల ఆవరణలోనే ఉన్నఅంగన్వాడీ 4,12 సెంటర్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.అంగన్ వాడీ టీచర్ ఆలస్యంగా రావడంపై వివరణ కోరగా మీటింగ్ కు వెళ్ళి రావడం వల్ల ఆలస్యం అయిందని టీచర్ సంజాయిషీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి శ్రీనివాస్,సి ఎం ఓ రాజేంద్రకుమార్ ,మండల విద్యాశాఖ అధికారి మాధవి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుసుమ పాఠశాల హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు.

*పత్తి మిల్లును సందర్శించిన కలెక్టర్*

ఉట్కూర్ మండలం తిప్రాస్ పల్లి గ్రామ సమీపంలో లో గల విజయ్ కాటన్ మీల్ ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు.మిల్లు లో ఉన్న రైతులతో మాట్లాడి పత్తిని అమ్మడానికి ఎలా తీసుకువచ్చారని వాకబు చేయగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని మిల్ కు తీసుకొచ్చామని ఆ రైతు తెలిపారు.అనంతరం కలెక్టర్ మిల్లులో పత్తి తుకాలు, కంప్యూటర్ లో కొనుగోళ్ల వివరాలను పరిశీలించారు. పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ ను వినియోగించుకుని పత్తిని మద్దతు ధరకు విక్రయించి లాభ పడాలని ఆమె కోరారు.తహసిల్దార్ చింత రవి,ఏవో గణేష్ రెడ్డి తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking