రక్తదానం ప్రాణదానం

రక్తదానం ప్రాణదానం

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళిగా
మెగా రక్తదాన శిబిరం

నారాయణపేట, అక్షిత ప్రతినిధి :

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీ ఎస్ హాజరై, మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుంది.పోలీస్ అమరవీరుల స్మరణోత్సవాల సందర్భంగా పోలీసులు, యువత,ప్రజలు,విద్యార్థులు పోలీసు సిబ్బంది ఇలా 92 యూనిట్లు రక్తదానం చేయడం జరిగిందని,వారు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.అలాగే,విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదని, వారి స్మృతికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.


పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షకులే కాకుండా, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం వలన ప్రమాదాలు,అత్యవసర పరిస్థితులు లేదా తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాణ రక్షణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య,సీఐ లు శివశంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్ ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాముడు,రాజు, నరేష్,రాము,రాజా శేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ డాక్టర్లు,తులసిన్య బ్లడ్ బ్యాంక్, స్టాఫ్,ప్రజలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking