ప్రజా యుక్తమే… పౌర సేవ

*తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో పౌర సేవ కేంద్రం ప్రారంభం*

ప్రతి ఒక్కరు పౌర సేవ కేంద్రంను ఉపయోగించుకోవాలి

తూంకుంట మున్సిపల్ ప్రత్యేక అధికారిని సంధ్య

మేడ్చల్, అక్షిత ప్రతినిధి :

మనిషి పుట్టిన దగ్గరి నుండి కడ వరకు పౌర సేవ కేంద్రాలు ఉపయోగ పడతాయని తూంకుంట మున్సిపల్ ప్రత్యేక అధికారిని సంధ్య తెలిపారు. తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం పౌర సేవ కేంద్రాన్ని మున్సిపల్ ప్రత్యేక అధికారిని సంధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని సంధ్య మాట్లాడుతూ తూంకుంట మున్సిపల్ కి సంబంధిన ప్రతి ఒక్క సేవ కు పౌర సేవ కేంద్రం ఉపయోగ పడుతుందని తెలిపారు.

మనిషి పుట్టిన దగ్గరి నుండి కడ వరకు ఈ పౌర సేవ కేంద్రం ను ఉపయోగించుకోవచ్చనారు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇంటి పర్మిషన్, ట్యాక్స్ వంటివి పొందేందుకు పౌర సేవ కేంద్రం ఉపయోగ పడుతుందని తెలిపారు. పౌరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే పౌర సేవ కేంద్రమన్నారు. ఈ అవకాశాన్నిమున్సిపల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ పౌర సేవా కేంద్రం (సిటిజెన్ సర్వీస్ సెంటర్) ను తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్యాలయంలో పౌర సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా ప్రజలే పౌర సేవ కేంద్రంకు వచ్చి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి, మేనేజర్ శ్రావణ్ కుమార్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking