కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటాం
* ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు/ అక్షిత న్యూస్:
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన బీసీ కులాల చట్టసభలలో రిజర్వేషన్ల సాధనకై ధర్మదీక్ష కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసి కేంద్రానికి పంపినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును అడ్డుకుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లభిస్తే, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీ బిడ్డలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీలు ఏకమై ముందుకు రావాలి.అన్నారు.అలాగే ఆయన, బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా చూడాలనే ఉద్దేశంతో బీజేపీ బిల్లును అడ్డుకుంటోందని ఆరోపించారు.

విద్యావంతులు, విద్యార్థులు, మేధావి వర్గం బీసీ సమాజాన్ని మేల్కొల్పే బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీసీ బిల్లు కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టినా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. బీసీలు అంటే వెనుకబడ్డ వారు కాదు.వెనుకకు నెట్టివేయబడినవారు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలంగాణ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య, రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు,ఆర్ కృష్ణయ్య ,జాజుల శ్రీనివాస్ గౌడ్,కోదండరామ్, విశారదన్,జస్టిస్ ఈశ్వరయ్య ,రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు,డాక్టర్ నిజ్జన రమేష్ డాక్టర్ వట్టికూటి రామారావు ,సాంబశివ,డాక్టర్ కంకల ఎలేందర్ కురుమ ,లింగస్వామి కురుమ,రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, కోరే కుమార్, స్వామి,అరుణ్,సుధాకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు,