‘ఉపాధి”తో ఆర్థిక భరోసా

ఉపాధి పనుల్లో పారదర్శకతకు చోటు 

ప్రజల నమ్మకానికి ప్రతీకగా ఉపాధి 

సామాజిక తనిఖీలు పారదర్శక పాలనకు పునాది

ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

అదనపు జిల్లా అధికారి శిరీష

నాగారం, అక్షిత న్యూస్ :  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల స్థాయి నాలుగో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శిరీష పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల హక్కులను కాపాడే అద్భుతమైన సామాజిక భద్రతా పథకం అని దీన్ని పారదర్శకంగా, నిజాయితీగా అమలు చేయడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు. మండలంలో గల 14 గ్రామపంచాయతీలు ఉండగా మూడు రోజులపాటు సామాజిక తనిఖీలు నిర్వహించగా, ఉపాధి పనుల రికార్డులు, పనికొలతలు, గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను సమీక్షించామని తెలిపారు. ఉపాధి హామీ పనులు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు సామాజిక తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో పని కొలతలలో వ్యత్యాసాలు, రికార్డుల నిర్వహణలో లోపాలు, పనుల ఫోటోలు భద్రపరచుకోవడం వంటి సమస్యలు బయటపడ్డాయని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని ఇప్పటికే పెనాల్టీలు విధించామని తెలిపారు. ఉపాధి పనుల్లో లోటుపాట్లు సవరించుకుంటూ కూలీలకు న్యాయమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిధులు ప్రజల సంక్షేమం కోసం వినియోగించబడేలా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఉపాధి పనుల్లో లోటుపాట్లు సవరించుకుంటూ కూలీలకు న్యాయమైన సేవలు అందించాలని అన్నారు. మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద రూ.3.57 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ. 1.90 కోట్లు విలువైన పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ ఆశ, అంబుడ్స్ మెన్ లచ్చిరాం నాయక్, జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ రామకృష్ణ, స్థానిక ఎంపిడివో భీమ్ సింగ్, ఏపీవో రవి, ఎస్ఆర్పి మన్నె సాయిలు, ఆయా గ్రామాల సామాజిక తనిఖీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, టిఏలు, ఎఫ్ఏలు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking