ప్రమాదాలకు నెలవైన యావర్ రోడ్

ప్రమాదాలకు నెలవైన
యావర్ రోడ్

ఫ్లై ఓవర్ బీచ్ నిర్మించాలి

కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి

జగిత్యాల, అక్షిత ప్రతినిధి :


జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నెలవైన యావర్ రోడ్డు విస్తరణ లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందించామని జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం అధ్యక్షులు సూరజ్ శివ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సూరజ్ శివ శంకర్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి ప్రజావాణిలో కలెక్టర్ వద్దకు వెళ్లి జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు గల యావర్ రోడ్డు విస్తరించాలి లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ వినతి పత్రం అందించారు. రోడ్డు నిత్యము రద్దీగా ఉండి పలు వాహనాలు రాకపోకల వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది గాయపడటమే కాక మరణించుట జరుగుచున్నది అని కావున తక్షణమే యావరోడ్ విస్తరించాలని కోరినామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చట్ట రాజేశ్వర్, వెంకటాద్రి, ఇరుగుల మల్లయ్య, ప్రభాకర్, రమేష్, అంజయ్య, నరేష్, పడాల శ్రీనివాస్, చిట్టి, సల్లూరి రాజు, చెట్టు రాజేశ్వర్,శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking