*అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా
– దేవరయాంజాల్ లో నాలా కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేత
మేడ్చల్, అక్షిత ప్రతినిధి :
తూంకుంట మున్సిపల్ పరిధిలో మంగళవారం హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూంకుంట మున్సిపల్ పరిధి దేవరయాంజాల్ లోని పలు కాలనీలు నీట మునిగి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో బాధితులు హైడ్రా కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. కొందరు అక్రమార్కులు దేవరయాంజాల్ లోని నాలా ను కబ్జా చేసి దానిపై గోడ నిర్మాణం చేపట్టడం తో కాలనీ లోని నీరు వెళ్ళలేకపోవడంతో హైడ్రా అధికారులు జెసిబి ల సహాయంతో ప్రహరీ గోడ ను కూల్చి వేశారు. అక్రమార్కుకు కబ్జా చేసిన కట్టడాలను కూల్చివేయడంతో వరద నీటిలో ముంపుకు గురైన కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఇన్స్ పెక్టర్ మల్లేశ్వర్, తూంకుంట మున్సిపల్ డిఈ సునీత, ఏఈ నిరీష, టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతి, ఇరిగేషన్ వర్క్ ఇన్స్ పెక్టర్ వాసు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.