కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సేవ పాఠశాలకు ఆదర్శం
పరిశుభ్రమైన త్రాగునీరు విద్యార్థులకు ఆరోగ్య రక్షణ
పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి పరిశుభ్రమైన నీరు
మండల విద్యాధికారి వాసం ప్రభాకర్
నాగారం, అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని పసునూరు మోడల్ స్కూల్లో మంగళవారం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం చేసిన మండల విద్యా అధికారి వాసం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినరల్ వాటర్ విద్యార్థుల ఆరోగ్యానికి సురక్షితమని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం గర్వించదగ్గ గత విషయమని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ కోసం పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం పాఠశాల అభివృద్ధిలో ఒక మంచి కీలక అంశమని అన్నారు. ఈ ప్రయత్నం ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బలుగూరి చంద్రబాబు మాట్లాడుతూ పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి పరిశుభ్రమైన నీరు, శుభ్రమైన వాతావరణం అత్యంత అవసరమని తెలిపారు. ఈ మినరల్ ప్లాంట్ ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా చదువులో మరింత కేంద్రీకృతం కావచ్చని అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సిఈ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కల్పించాలని లక్ష్యంతో ఫౌండేషన్ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, టెక్నీషియన్ నాగరాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.