అమీన్‌పూర్‌లో రౌడీ రాజ్యం!
కబ్జాదారులను ప్రశ్నిస్తే దాడులు…
-ఎవరి అండ చూసుకుని దాడి చేస్తున్నారు
-ప్రశ్నించిన ఎమ్మర్వోపై దాడికియత్నం
-వార్త ప్రచురించిన జర్నలిస్టుపై దాడి
-అర్థరాత్రి ఇంటి వద్దకు వచ్చి దాడి
-పోలీసుల ఎదుటే దాడి చేసిన దుండగులు
పటాన్‌చెరు అక్షిత ప్రతినిధి :
అమీన్‌పూర్‌లో రౌడీ రాజ్యం నడుస్తుందా?అధికారులు తమ పని చేసుకునే పరిస్థితి కూడా లేదా? తాజాగా జరిగిన పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తుంది.తాజాగా అమీన్‌పూర్ పరిధిలోని సర్వేనెంబర్ 630లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో వెంకటేష్ పరిశీలించి,అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశాలు జారి చేశారు.ఇదే సమయంలో కొందరు కబ్జాదారులు ఎమ్మార్వో వెంకటేష్‌పై దాడికి యత్నించారు. ఈ వార్తను కవర్ చేసి ప్రచురించిన విఠల్ అనే జర్నలిస్టును టార్గెట్‌గా చేసుకుని కొందరు దుండగులు దాడి చేశారు.జవహర్ నగర్ కాలనీలో నివాసం ఉండే విఠల్ ఎప్పటిలాగే ఇంటికి వెళ్లాడు.

అయితే అర్థరాత్రి సమయంలో అతడి ఇంటి వద్దకు చేరుకున్న 15 మంది దుండగులు ఇంటి అద్దాలను పగులగొట్టాడు.దీంతో విఠల్ ఇంటిలోపలే ఉండి, పోలీసులకు ఫోన్ చేశాడు.దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడుకు చేరుకోగా తలుపుతీస్తున్న విఠల్‌పై పోలీసుల సాక్షిగా దుండగులు దాడి చేసి గాయపరిచారు.దీంతో భగ్ను మన్న జర్నలిస్టు సంఘాలు పోలీసులను కలసి ఫిర్యాదు చేశారు.అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,సిఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులకోసం గాలిస్తున్నారు…
ఎవరి అండ చూసుకుని దాడులు?
అమీన్‌పూర్ పరిధిలోని సర్వేనెంబర్ 630లో నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలు సాగుతున్నాయి.వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులపై దాడులు,ఈ వార్తను ప్రచురించిన జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారంటే వీరి వెనుక ఎవరు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతగా బరితెగించి దాడులు చేస్తున్నారంటే వారి వెనుక రాజకీయ నేతల హస్తం ఉంటుందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఓ ప్రభుత్వ అధికారి మరో జర్నలిస్టుపై దాడి జరిగితే ఈ దాడిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఖండించకపోవడం వెనుక వీరి హస్తం కూడా ఈ అక్రమాల పుట్టలో ఉండిఉండవచ్చన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏదిఏమైనా అమీన్‌పూర్ సర్వే నెంబర్ 630లో అక్రమ కట్టడాల విషయంలో రాజకీయ పార్టీల నేతల ఒత్తిళ్లను పక్కనపెట్టి,కలెక్టర్ చర్యలు తీసుకోవాలని,ఎమ్మార్వోతో పాటూ జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.