చెస్ లో  రన్నర్ గా నిలిచిన పోలేపాక తనుశ్రీ

చెస్ లో  రన్నర్ గా నిలిచిన పోలేపాక తనుశ్రీ

అభినందించిన జోనల్ అధికారి అరుణకుమారి, ప్రిన్సిపాల్ కే. సంధ్యారాణి

తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి :

తుంగతుర్తి మండల కేంద్రంలో నీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు కొనసాగిన 11వ జోనల్ లేబర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో అండర్ 17 చెస్ విభాగంలో అకాడమి క్రీడాకారిణితో తలపడి తుంగతుర్తి గురుకుల పాఠశాలకు చెందిన పోలెపాక తనుశ్రీ రన్నర్ గా నిలిచారు. మొదటి స్థానంలో జాజిరెడ్డి గూడెం గురుకుల పాఠశాల చెందిన అకాడమి క్రీడాకారిణి కె కుశాలి మొదటి స్థానంలో నిలిచారు. ఈ మేరకు శనివారం గురుకుల పాఠశాల జోనల్ అధికారి అరుణకుమారి చేతుల మీదుగా షీల్డ్ బహకరించి తనుశ్రీ ని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కే.సంధ్యారాణి మాట్లాడుతూ.. మా పాఠశాలకు చెందిన తనుశ్రీ అకాడమీ ప్లేయర్ తో తలపడి రెండవ స్థానంలో నిలవడం చాలా సంతోషమని, ఇదే స్ఫూర్తితో చెస్ లో జిల్లా రాష్ట్రస్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలని ఆకర్షించారు. తమ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, పీడీ లు, పీఈటీ లు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking