చివరి గింజ వరకు కొంటాం

చివరి గింజ వరకు కొంటాం

దామరగిద్ద మండల పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రం – ప్రారంభించిన పేట ఏఎంసి చైర్మన్ సదాశివరెడ్డి, కుంభం*శివకుమార్ రెడ్డి*

నారాయణపేట, అక్షిత ప్రతినిధి :

దామరగిద్ద మండలం పిడెం పల్లి,మల్ రెడ్డిపల్లి,కానుకుర్తి గ్రామాల లో వరి కొనుగోలు కేంద్రాలను మాజీ డీసీసీ అధ్యక్షుడు,కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం శివారెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వరి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వ్యక్తిగత పి.ఏ.చిట్టెం మాధవరెడ్డి, రెడ్డి,వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్,వెంకట్ రెడ్డి, తుమ్మలి రఘు,ఖాజా,రాఘవేందర్, అంజి, రైతులు,గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking