మల్లన్న సేవలో దేవాంగ్ సంఘం మహిళలు
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
పవిత్ర శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ దేవాంగ్ సమాజ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తిని చాటుతున్నారు. మల్లన్న సన్నిధిలో గత మూడు రోజుల నుండి మహిళలు వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై తరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి ఆలయంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. జాజాపూర్ దేవాంగ్ సమాజ మహిళా సభ్యులు గత కొన్నేళ్ల నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి సేవలో పాల్గొంటున్నారు.