*దివ్యజ్ఞాన గ్రంథం భగవద్గీత*
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
భగవద్గీత పఠనం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుందని మానవజన్మ పరిపూర్ణత సాధన కొరకు ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చేసి వాటిలోని శ్లోకాలను ఆచరించి నడుచుకోవాలని సృష్టికి మూలంతో పాటు భగవద్గీత దివ్యజ్ఞానమని ఎస్పి బాలు అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహి పాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా భగవద్గీత గ్రంథలను పంపిణి చేయడం గర్వ కారణంఅని యోగి అచ్యుత ఆశ్రమ సాధకులు విద్య శ్రీ గోవర్ధన శారి పిలుపునిచ్చారు. అంతకుముందు సద్గురు అవధూత నరసింహస్వామి మఠం మాజీ అధ్యక్ష కార్యదర్శులు దేవదత్త ఢగే తిప్పన్న కళ్యాణి లు భగవద్గీత గ్రంథాలకు పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాష ఉపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు యశ్వంత్ లాండ్గే, ప్రముఖ వ్యాపారస్తులు నాగురావ్ కమలాపూర్, బిజెపి నాయకులు కిరణ్,బిఆర్ఎస్ నాయకులు అభిరామ్, అర్చకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.