భవిష్యత్తు అంతా ఏఐదే

*ఏఐలో మంచి, చెడు రెండూ కీలకం
*-భవిష్యత్తు అంతా ఏఐదే*
*-చెడు పట్ల అప్రమత్తంగా* *ఉండాలి*
*-టీయూడబ్ల్యూజే రాష్ట్ర* *అధ్యక్షులు విరాహత్ అలీ*

*-ఏఐతో ఎన్నో అద్భుతాలు* *చేయవచ్చు*
*-సుప్రసిద్ధ పాత్రికేయులు సుధాకర్ రెడ్డి

అక్షిత ప్రతినిధి, గజ్వేల్ :

ఏఐలో మంచి, చెడు రెండూ దాగి ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (⁠టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు. ఆదివారం నాడు గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన “ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-మీడియా” అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. గెస్ట్ లెక్చరర్ గా
ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్) ఉడుముల సుధాకర్ రెడ్డి హాజరై ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పై అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. ఏఐ కత్తిలాంటిదని, అది ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ చేతితో రోగికి ప్రాణం పోస్తుందని, అదే కత్తి ఓ నేరస్తుడి చేతితో ప్రాణం తీస్తుందన్నారు. మనం ఎలా ఉపయోగించుకుంటే అలా రూపం మారుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో విలేకరులకు ఏఐపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు వివరించారు. ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని, అన్ని రకాల సమాచారం నిమగ్నమై ఉంటుందని, కానీ పూర్తి స్థాయిలో ఏఐపై ఆధారపడవద్దని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు.
అనంతరం జర్నలిస్టులకు విరాహత్ అలీ, సుధాకర్ రెడ్డిలు సర్టిఫికెట్లు పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు సురేందర్, సత్యనారాయణరావు, కృపాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయిని యాదగిరి, విజయరావు, ఎల్లం, కృష్ణ, చిన్న యాదగిరి, రమణారెడ్డి, కిరణ్, జగదీశ్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మునీర్, బాల్ నర్సయ్య, వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, యాదగిరి, బాలకృష్ణ రెడ్డి లతో పాటు నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రధాన మీడియా సంస్థల్లో పనిచేస్తున్న 70మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking