ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ
సద్వినియోగం చేసుకోవాలి

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కార్తిక్

వనపర్తి, అక్షిత ప్రతినిధి :

ఉచిత సేవలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కార్తిక్ రెడ్డి సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చేయడమే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం అన్నారు. పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఎస్సైలు, సఖీ కేంద్రం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ సంస్కృతి, సాహితీ కళాకరుల బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking