ఖమ్మంలో ఘనంగా లంబాడీల వనభోజన మహోత్సవం
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం ఆర్ జి బి మామిడి తోటలో ఆదివారం లంబాడి కులా ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ వ్యాపార వర్గాలకు చెందిన వేలాది కుటుంబాలు ఏకమై కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సాంప్రదాయ సాంస్కృతిక పద్ధతిలో ఘనంగా జరుపుకున్నారు. మర్చిపోతున్న లంబాడీల వేసా భాష సంప్రదాయలను ఈతరం పిల్లలకు అర్థమయ్యేలా కట్టుబాట్లను నేర్పించి ఉన్నత చదువులు చదివించి దేశానికి సమాజానికి ఉపయోగపడేలా చూడాలి అన్నారు.రాజకీయ రంగంలో సైతం ఐక్యమత్యంగా ఉండి రాజాధికారం దిశగా అడుగులు వేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ పోరిక రాములు నాయక్ కో-కన్వీనర్ భూక్య మంగ్యా నాయక్ ట్రెజరర్ మంగిలాల్ జాదవ్ ప్రముఖులు టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి హరిప్రియ నాయక్ ఖమ్మం మాజీ మేయర్ పాపాలాల్ టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ కుల సంఘం నాయకులు రాజకుమార్ జాదవ్ బిక్షపతి రాథోడ్ బాల్ సింగ్ జి రమేష్ కిషన్ నాయక్ దశరధి నాయక్ చక్రవర్తి హదిరామ్ పాపాలాల్ రామారావు బన్సీ లాల్ సీతారాం దేవా సింగ్ నాగు దాసు గౌతమి జ్యోతి ఇందిరా తదితరులు పాల్గొన్నారు.